ఢిల్లీ సరిహద్దుల్ లో భారీ ట్రాఫిక్ జామ్: వాహనాల వల్ల వెలువడుతున్న కార్బన్ ఉద్గారాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: Delhi
ఢిల్లీలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాన్ బీఎస్ 6 వాహనాలపై నిషేధం విధించడంతో సరిహద్దుల్ లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. గురుగ్రామ్, ఘాజిపూర్ సరిహద్దుల వద్ద వాహనాలు బారులు తీరడంతో భారీగా కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నట్లు అంచనా వేశారు. ట్రాఫిక్ లో నిలిచిపోయిన కార్ల కారణంగా నిమిషానికి పెద్ద ఎత్తున కాలుష్యం విడుదలవుతోందని, దీనివల్ల వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని జర్నలిస్ట్ ఇషిత జైరత్ విశ్లేషించారు.