రాజాపేటలో పిరమిడ్ ధ్యాన సదస్సుకు పోటెత్తిన ఆధ్యాత్మిక భక్తులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో పిరమిడ్ మాస్టర్స్ లక్ష్మి మరియు అరుణ జ్యోతి ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక సమావేశానికి వివిధ గ్రామాల నుండి పిరమిడ్ భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ధ్యాన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం సామూహిక అన్న ప్రసాద వితరణ చేపట్టగా, నిర్వాహకులను శాలువాలతో సత్కరించి ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు.