నిరుద్యోగులకు గుడ్ న్యూస్: మరో డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న సర్కార్

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

కూటమి ప్రభుత్వం మంగళవారం మరో డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ బుధవారం నుంచి అమల్లోకి రానున్నందున సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్య, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో కలిపి రెండు వేల ఏడు వందలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.