టీచర్లపై వైసీపీ మూకల దాడి సిగ్గుచేటని మండిపడ్డ వేమలి చైతన్య బాబు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయవాడలో టీచర్లపై వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ విజయనగరంలో తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షులు వేమలి చైతన్య బాబు సంఘీభావం తెలిపారు. గౌరవించాల్సిన ఉపాధ్యాయులపై బూతులు మాట్లాడుతూ భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.