గాంధీ జయంతి సందర్భంగా నగరంలో మాంసం దుకాణాలు బంద్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాంసం దుకాణాలు పూర్తిగా బంద్ ఉండనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. శాంతి, అహింసలను గౌరవిస్తూ స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు వెల్లడించారు. నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పశువుల వధశాలలు, అన్ని రకాల మాంసపు విక్రయ కేంద్రాలు మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.