యూఎన్ వేదికగా పాకిస్థాన్ తీరును ఎండగట్టిన భారత్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New York

పాకిస్థాన్లో అసలు అధికారాన్ని సైన్యమే చెలాయిస్తోందని యూఎన్లో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గహ్లోత్ మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా.. భారత్ రైట్ ఆఫ్ రిప్లై ద్వారా ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదానికి ఆ దేశం మద్దతు ఇస్తోందని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని అణచివేత పరిస్థితులను అంతర్జాతీయ వేదికపై భారత్ తీవ్రంగా ఎండగట్టింది.