మణుగూరు బస్సు కండక్టర్ ప్రవళిక ఆరోగ్యం విషమం: వెంటిలేటర్ పై చికిత్స

రిపోర్టర్: వెంకట్ స్థలం: మణుగూరు

చిల్లర వివాదంలో కదులుతున్న బస్సు నుంచి తోసివేయడంతో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న ఆమెకు గుండెపోటు రావడంతో వైద్యులు ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ఆర్టీసీ సిబ్బంది పేర్కొన్నారు.