రాజమహేంద్రవరంలో ఘనంగా బీజేపీ వంద జెండాల పండగ కార్యక్రమం

రిపోర్టర్: కిరణ్ స్థలం: తూర్పు గోదావరి

రాజమహేంద్రవరంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద జెండాల పండగ ఘనంగా జరిగింది. కంబాలచెరువు వద్ద జరిగిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ, పార్టీకి దేశమే ప్రథమమని, అధికారం సేవకేనని నొక్కి చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు, పోలవరం రోడ్డుకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు.