అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 20 వేల ఎకరాల భూసేకరణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా సుమారు 20 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు కేటాయించనుండగా, మిగిలిన భూమిని మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌కు ఆమోదం తెలపనున్నట్లు ఆయన తెలిపారు.