కడపలో ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్పై పోలీసుల కాల్పులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: దువ్వూరు

కడప జిల్లా దువ్వూరు మండలం జగనన్న కాలనీ సమీపంలో కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ షేక్ చింపతి జాకీర్పై పోలీసులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక తనిఖీల్లో భాగంగా పోలీసులు వెళ్లగా, జాకీర్ తన అనుచరులతో కలిసి రాళ్లు, కొడవళ్లతో దాడికి దిగి కానిస్టేబుల్ చెన్నయ్యను గాయపరిచాడు. పరిస్థితి చేయిదాటడంతో ఎస్సై ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా, జాకీర్ కాలికి గాయమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాకీర్ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.