రాజాపేట గుట్టల్లో అక్రమ తవ్వకాలు: చల్లూరులో గుట్టుచప్పుడు కాకుండా క్రషర్ పనులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని చల్లూరు శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ కంకర తవ్వకాలు మళ్లీ కొనసాగుతున్నాయి. సర్వే నంబర్ 322 పరిధిలోని గుట్టలను పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతూ కొల్లగొడుతున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపదను ధనార్జనే ధ్యేయంగా కొల్లగొడుతున్న వారిపై వెంటనే అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.