నాగోలులో విషాదం: నాలుగు రోజులుగా కనిపించకుండాపోయిన ఇద్దరు చిన్నారులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
నాగోలు సాయిరాం నగర్ లో గతనెల 31 నుంచి ఇద్దరు చిన్నారులు వరుణ్ తేజ్, మహేష్ అదృశ్యమైనట్లు వారి తల్లి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. బడికి పంపిస్తామనే భయంతో వారు ఇల్లు విడిచి వెళ్లినట్లు తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మూసీ నది వంతెన దాటి ఉప్పల్ భగాయత్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించి విస్తృతంగా వెతుకుతున్నారు.