వృద్ధులకు తీపి కబురు: అన్ని జిల్లాల్లో ఆశ్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటన

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

నిరాశ్రయులైన వృద్ధుల కోసం రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రకటించారు. రవీంద్రభారతిలో జరిగిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ వృద్ధుల గౌరవం, భద్రత, ఆరోగ్యంతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక అధికారిని నియమించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.