ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ టైర్-2 ఫలితాలు విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: India

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) టైర్-2 రిక్రూట్‌మెంట్ పరీక్షా ఫలితాలను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ విడుదల చేసింది. మార్చిలో నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా 7,267 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nests.tribal.gov.in ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు తమ వివరాలను సరిచూసుకుని, ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.