అల్లూరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగుతున్న గుర్రాయి జలపాతం
రిపోర్టర్: కిరణ్
స్థలం: జి.మాడుగుల
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో కురుస్తున్న వర్షాలకు ప్రసిద్ధ గుర్రాయి జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. చుట్టూ పచ్చని అడవులు, కొండల నడుమ పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతున్న ఈ వాటర్ ఫాల్స్ అందాలు చూడచక్కగా ఉండి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వర్షాకాలం వేళ ఈ జలపాతాల ఉధృతి పెరగడంతో స్థానిక ప్రకృతి ప్రేమికులు సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు.