ముంబై లోకల్ ట్రైన్లో మహిళల కృష్ణాష్టమి వేడుకలు వైరల్
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
ముంబై లోకల్ ట్రైన్లో మహిళలు కృష్ణాష్టమి వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. బద్లాపూర్-థానే లోకల్ రైలులో డ్యాన్సులు చేస్తూ, ఉట్టిని పగులగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణంలో ఇలాంటి వేడుకలు సబబేనా అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు మహిళల ఉత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు. రైల్వే అధికారులు ఇంకా దీనిపై స్పందించలేదు.