స్థానిక సంస్థల ఎన్నికలు: అధికారులకు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కీలక ఆదేశాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ తదితరులు పాల్గొన్నారు.