చీపురుపల్లిలో వైకాపాకు భారీ షాక్: తెదేపాలోకి మాజీ సర్పంచులు
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
చీపురుపల్లి మరియు గరివిడి మేజర్ పంచాయతీల మాజీ సర్పంచులు మంగళగిరి సుధారాణి, పి.ప్రమీల సహా పలువురు కీలక నేతలు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చీపురుపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తామంతా జడ్పీ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తామని స్పష్టం చేశారు. త్వరలో జరిగే బహిరంగ సభలో అధికారికంగా తెదేపాలోకి చేరనున్నట్లు వారు తెలిపారు.