టీడీపీ అకృత్యాలపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం: ప్రజాస్వామ్యం ఖూనీ
రిపోర్టర్: సునీల్
స్థలం: Andhra Pradesh
ఎన్నికల నామినేషన్లలో టీడీపీ అకృత్యాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సిపట్నంలో నామినేషన్ల తిరస్కృతిపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం సీఎంవోలో విభాగంలా పనిచేస్తోందని ఆరోపించారు. దొంగ ఓట్లతో ఎన్నికలకు వెళ్లవద్దని డిమాండ్ చేస్తూ, ప్రతిపక్షాన్ని నామినేషన్ వేయనీయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.