జీవనోపాధిని కోల్పోతున్న చిరువ్యాపారుల ఆక్రోశ గర్జన
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గత నలభై ఏళ్లుగా రేకుల డబ్బాలతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న తమను తొలగిస్తే బతుకుదెరువు కష్టమవుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రైవేటు వ్యక్తులు విరాళంగా ఇచ్చిన ఈ స్థలంలో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అధికారులు స్పందించి తమ దుకాణాలను తొలగించకుండా ప్రత్యామ్నాయ న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్‌ను వేడుకుంటున్నారు.