రేషన్ కార్డుదారులకు తీపి కబురు: కొత్తగా మరో ఆరు సరుకులు
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు త్వరలోనే భారీ ఊరట లభించనుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి మరో ఆరు రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలపై అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ప్రతిపాదనను పరిశీలిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే పూర్తి స్థాయి విధివిధానాలు ఖరారవుతాయని సమాచారం.