స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ నిధులు మంజూరు చేసిన ఏపీ సర్కార్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రెండు వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు వంద కోట్లు, ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలకు మరో వంద కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.