నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రంలో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
నెల్లూరు పోలీసు శిక్షణ అకాడమీలో తొమ్మిది నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న నూట డెబ్బై ఆరు మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు పెద్దఎత్తున హాజరు కావడంతో ప్రాంగణంలో సందడి నెలకొంది. కన్నబిడ్డలు ఖాకీ దుస్తుల్లో సెల్యూట్ చేస్తుంటే తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. ఆధునిక సాంకేతికత, సైబర్ నేరాల నియంత్రణపై అభ్యర్థులకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.