అసంఘటిత కార్మికుల కోసం పెన్షన్ ఖాతా కొత్త సదుపాయం

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థిరమైన నెలవారీ ఆదాయం లేని కార్మికులు కూడా సులభంగా పెన్షన్ ఫండ్ సమకూర్చుకునేలా కొత్త డిజిటల్ విధానాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ-శ్రమ్ వివరాల ఆధారంగా శాలరీ స్లిప్స్ లేకుండానే నేరుగా డిజిటల్గా పెన్షన్ ఖాతా ప్రారంభించేలా ప్రత్యేక సదుపాయాన్ని రూపొందించే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు వెల్లడించారు.