హిందూ సంప్రదాయాలపై అవగాహన కోసం అమెరికాలో ప్రత్యేక సదస్సు నిర్వహణ
రిపోర్టర్: సురేష్
స్థలం: North Carolina
అమెరికాలోని నార్త్ కరోలినాలో హిందూ సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయతను పరిచయం చేసేలా ప్రత్యేక సదస్సు నిర్వహించినట్లు విద్యార్థి రిషి జాస్తి తెలిపారు. హైస్కూల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆచారాల తాత్విక కోణాలను వివరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో జరిగిన ఈ వేడుకలో పలువురు విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.