చర్లపల్లి జైలులో గుండెపోటుతో ప్రణయ్ హత్య కేసు నిందితుడు మృతి
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది వెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. 2018 సెప్టెంబర్ 14న జరిగిన ఈ సంచలన హత్య కేసులో బారీ నాల్గో నిందితుడిగా ఉన్నాడు. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులోనూ ఇతను నిందితుడిగా నిలిచాడు.