ఇండియా కూటమి ర్యాలీ సూపర్ ఫ్లాప్: బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ధ్వజం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలోని రామ్లీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి నిర్వహించిన భారీ సభ పూర్తిగా సూపర్ ఫ్లాప్ అయిందని బీజేపీ ఎంపీ సంబి పాత్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైదాన్ లో నలభై శాతం మేర స్థలం ఖాళీగా ఉందని, పది లక్షల మంది వస్తారని గొప్పలు చెప్పుకున్న ప్రతిపక్ష నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు ఆరోపణలతోనే ఈ సభను ఏర్పాటు చేశారని సంబిత్ పాత్ర స్పష్టం చేశారు.