స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన: దేవినేని ఉమా వెల్లడి

రిపోర్టర్: మహేష్ స్థలం: ఎన్టీఆర్

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రత్యక్ష విధానం తీసుకొచ్చామని, విద్యావంతులు, యువతకు కూటమి అభ్యర్థులుగా అవకాశం కల్పించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని, అందుకే ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రాబోయే రోజుల్లోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.