వేగపు రక్కసి కాటుకు బోల్తాపడ్డ ప్రయాణికుల ఆటో
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలో సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారి పైకి ఎక్కుతున్న మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు నుంచి వెంకటాచలం వస్తున్న టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు వేగంగా వచ్చి ప్రయాణికుల ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో ఒక్కసారిగా రహదారిపై బోల్తా పడి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
హుటా హుట్న పోలీసులు ప్రవేశం చేసి అంతరాయం ఏదీ లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది.