నెల్లూరులో భారీ ట్రాఫిక్ జామ్: వాహనదారులకు పగలే చుక్కలు చూపించిన నిలిచిపోయిన రాకపోకలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Nellore

నగరంలోని వీఆర్సీ పీజీ కళాశాలలో పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తిందని స్థానికులు తెలిపారు. సమీపంలోనే కూరగాయల మార్కెట్, దీపావళి టపాసుల దుకాణాలు ఉండటం, మరోవైపు కౌంటింగ్ సిబ్బంది, నాయకుల వాహనాలు భారీగా తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రహదారుల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.