రాష్ట్రంలో శిథిల వంతెనల నిర్మాణానికి ఆర్థికశాఖ కొర్రీలు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన శిథిల వంతెనల నిర్మాణానికి ఆర్థికశాఖ కొర్రీలు వేస్తుండటంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆర్‌అండ్‌బీ రహదారులపై ఉన్న 100 వంతెనల నిర్మాణానికి రూ.818 కోట్లు అంచనా వేయగా, ముఖ్యమంత్రి ఆదేశించినా సమగ్ర అంచనాల పేరుతో ఆర్థికశాఖ తాత్సారం చేస్తోంది. తారు ధరల పెంపుపై చిన్న గుత్తేదారులకు వెసులుబాటు కల్పించకపోవడం కూడా రోడ్ల పనులకు ఆటంకంగా మారింది.