ప్రజాసేవే లక్ష్యంగా మేయర్ బరిలో నిలిచానన్న డాక్టర్ స్పర్శ చౌదరి
రిపోర్టర్: THADI BHAVANI
స్థలం: విజయనగరం
విజయనగరం మేయర్ ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ స్పర్శ చౌదరి మాట్లాడుతూ తనకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తనకు వరుస నెంబర్ ఆరు ఫ్లూటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజయనగరం పట్టణ ప్రజలను ఈ సందర్భంగా ఆమె అభ్యర్థించారు.