అమెరికా ఎన్నికల్ లో సంచలనం: న్యూయార్క్ అటార్నీ జనరల్ బరిలో తెలుగు మహిళ
రిపోర్టర్: రాము
స్థలం: జగిత్యాల
అమెరికాలోని న్యూయార్క్ అటార్నీ జనరల్ మధ్యంతర ఎన్నికల్ లో తెలుగు మూలాలున్న సరితారెడ్డి పోటీ చేస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుత జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాంకు చెందిన ఈమె, రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. బ్రూక్లిన్ లో పుట్టి పెరిగిన సరితారెడ్డి న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. ఆమె ఎన్నికల్ లో పోటీ చేస్తుండటంతో స్వగ్రామంలోని బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.