హైదరాబాద్‌లో కోటి విలువైన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
హైదరాబాద్ నాంపల్లి రెడ్‌హిల్స్‌లో సుమారు నాలుగు వందల ఎనభై ఫ్లాట్లతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్ శంకుస్థాపన చేశారని అధికారులు తెలిపారు. నిరుపేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టిందని వారు పేర్కొన్నారు. ఒక్కో ఫ్లాట్ విలువ సుమారు ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఏడాదిలోపే నిర్మాణాలు పూర్తి చేసి తాళాలు అప్పగిస్తామని చెప్పారు.