రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఐదేళ్లవుతోందంటూ సాయి దుర్గా తేజ్ భావోద్వేగం

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గా తేజ్ భీకర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం తనకు ప్రాణాపాయం తప్పిందని, కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశీస్సులతోనే రెండో జన్మ లభించిందని ఆయన వెల్లడించారు. తన గాయాల నుంచి దాదాపుగా కోలుకున్నానని, ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయాల్లో విధిగా హెల్మెట్ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.