టీజేఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా షేక్ సయ్యద్ ఖాసీం నియామకం
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) వర్కింగ్ ప్రెసిడెంట్గా ‘అక్షిత’ దినపత్రిక బ్యూరో చీఫ్ షేక్ సయ్యద్ ఖాసీం నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు జి. నాగస్వామి ఆయనకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఖాసీం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టీజేఏను మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.