గ్రామీణ కూలీలకు గుడ్ న్యూస్: 125 రోజులు ఉపాధి హామీ పనులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
గ్రామీణ ప్రాంతాల కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిందని, ఉపాధి హామీ పథకం కింద పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయ పనులు లేక అల్లాడుతున్న రైతన్నలు, కూలీలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నవంబర్ మొదటి తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.