రూ. లక్ష కోట్ల ప్రభుత్వ బాండ్లను విక్రయించనున్న ఆర్బీఐ

రిపోర్టర్: అశోక్ స్థలం: India

భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో పెరిగిన ద్రవ్యలభ్యతను అదుపులోకి తెచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కింద రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను మూడు విడతల్లో విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది. మార్కెట్‌లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య చేపట్టింది.