నర్సంపేట మహిళా కారాగారంలో అధికారుల భద్రతా సమీక్ష తనిఖీలు
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేట మహిళా కారాగారాన్ని ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ ఎం.శ్రీనివాస్, జైలర్ కే.స్రవంతి ఆధ్వర్యంలో అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా కారాగారంలోని భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను తనిఖీ చేసి, ఏర్పాట్లు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు.