కేంద్ర పన్నుల వాటాపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిప్పులు
రిపోర్టర్: శివ
స్థలం: ఖమ్మం
దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా నిధులు సమకూరుస్తున్న తెలంగాణకు కేంద్ర పన్నుల వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయికి కేవలం నలభై మూడు పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని, కానీ పనితీరు లేని రాష్ట్రాలకు మాత్రం రెండు నుంచి మూడు రూపాయలు ఇస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సహకార సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రదర్శిస్తున్న ఈ వివక్షను కేంద్ర ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.