అమరావతిలో శాసనసభ భవనంపై ఎత్తైన టవర్ నిర్మాణానికి టెండర్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాజధాని అమరావతిలో శాసనసభ భవనంపై ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో రెండు వందల యాభై మీటర్ల ఎత్తైన టవర్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు పురపాలక శాఖ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లో వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మౌలిక వసతుల అభివృద్ధికి సీఆర్డీఏకు అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే రెండో విడత భూసమీకరణ జరిగే ఏడు గ్రామాల పరిధిలో తక్కువ భూమి ఉన్న రైతులకు ఎకరానికి సమానమైన కౌలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.