టాలీవుడ్లో సరికొత్త కామెడీ అడ్వెంచర్: వేణు ఊడుగుల సమర్పణలో చంద్రయాన్ సినిమా
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న తాజా సినిమా చంద్రయాన్ రాకెట్ లాంచ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, శివకుమార్ ధీకొండ మరియు స్వప్న ప్రియదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాదాపూర్ రెట్రో డ్రైవ్-ఇన్లో జరిగిన ఈ వేడుకకు దర్శకుడు సంకల్ప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారని చిత్ర బృందం స్పష్టం చేసింది.