గుంటూరు మిర్చి యార్డులో వరద బీభత్సం: తడిచిపోయిన వేలాది బస్తాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: గుంటూరు
మురసు తుపాను ప్రభావంతో గుంటూరు మిర్చి యార్డు నీట మునిగిందని, వేలాది బస్తాలు తడిచిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు మరియు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడంతో భారీ వర్షపు నీరు యార్డులో నిలిచిపోయిందని బాధితులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి నీటిని తొలగించి, నష్టపోయిన తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.