ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: దుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతుల పట్టువస్త్రాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు వెల్లడించారు.