గణపతి లడ్డూను దక్కించుకున్న పల్లెర్ల గ్రామ యువకుడు మేడి స్వామి మౌర్య

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద నిర్వహించిన వేలంపాటలో గ్రామ యువకుడు మేడి స్వామి మౌర్య లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.