విజయనగరం యూత్ హాస్టల్లో అంగన్వాడీలకు ఘన సత్కారం చేసిన బీజేపీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా విజయనగరం యూత్ హాస్టల్లో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లను సత్కరించారు. గర్భిణీలకు సీమంతం నిర్వహించి పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేశారు. మహిళలు, శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మధుకరజీ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డిపావని, జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, వై.స్మిత తదితరులు పాల్గొన్నారు.