పోషణ మాస ఉత్సవాలతో పులకించిన మద్దిలేడు అంగన్వాడీ కేంద్రాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి రూరల్ మండలం మద్దిలేడు ముద్దుమూడి అంగన్వాడి కేంద్రాలలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాస ఉత్సవం ఘనంగా నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ఎంతో అవసరమని సూపర్వైజర్ హరిత తెలిపారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, చిరుధాన్యాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆహార పదార్థాలు ప్రదర్శించి పంచిపెట్టారు.