ఆంధ్రప్రదేశ్లో ముందస్తు కరవు ప్రకటన: ఇరవై ఒక్క జిల్లాల్లోని మూడు వందల ఎనభై ఎనిమిది మండలాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కరవు మండలాలను ప్రకటించిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ వెల్లడించారు. ఇరవై ఒక జిల్లాలోని మూడు వందల ఎనభై ఎనిమిది మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో రైతులకు రుణాల రీషెడ్యూల్తో పాటు తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు.