బీఆర్ఎస్ తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ గేట్ల వద్ద నిరసనల పేరుతో బట్టలు విప్పుకుని నిరసన తెలపాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. స్పీకర్‌ను దూషించడాన్ని ఖండిస్తూ, సభా మర్యాదలు మంటగలిపేలా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.