దుబాయ్కు వెళ్లనున్న ఎమ్మెల్యే హుమాయున్ కబీర్: బాబ్రీ మసీదు నిర్మాణంపై సంచలనం
రిపోర్టర్: రమేష్
స్థలం: Murshidabad
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు నమూనాలో తాను నిర్మిస్తానన్న మసీదు పనులు పూర్తయిన తర్వాత పదేళ్ల గోల్డెన్ వీసాతో దుబాయ్లో నివసిస్తానని నౌదా ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రేజినగర్ ఉపఎన్నికలో తన కుమారుడు ఓటమిపాలైన తరుణంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముర్షిదాబాద్లోని ఈ నియోజకవర్గంలో బీజేపీ విజయం వెనుక పోలీసు అధికారుల హస్తం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.